జీఎస్టీ కొత్త రికార్డు.. ఆల్‌ టైమ్ హైకి వసూళ్లు

జీఎస్టీ కొత్త రికార్డు.. ఆల్‌ టైమ్ హైకి వసూళ్లు

2020 పోతుపోతూ.. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వ‌సూళ్లలో కొత్త రికార్డు సృష్టించిపోయింది.. 2020 ఏడాది చివరన డిసెంబ‌ర్‌లో కొత్త రికార్డును అందుకున్నాయి జీఎస్టీ వసూళ్లు.. ఈ నెలలో ఏకంగా రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల వ‌సూళ్ల‌తో ఆల్‌టైమ్ హైని అందుకుంది జీఎస్టీ... జీఎస్టీని అమలు చేసిన త‌ర్వాత ఈ స్థాయి వ‌సూళ్లు రావడం.. ఇదే తొలిసారని ఆర్థిక‌శాఖ ఓ ప్రకటనలో వెల్ల‌డించింది. క‌రోనావైరస్‌ అన్ని రంగాలను దెబ్బ కొట్టినా.. త‌ర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా కోలుకోవ‌డం, జీఎస్టీ ఎగ‌వేత‌దారుల‌పై క‌ఠిన చ‌ర్య‌ల తీసుకోవడం వల్లే ఈ భారీ వ‌సూళ్లు సాధ్య‌మైన‌ట్లు పేర్కొంది. దేశీయ లావాదేవీల‌పై వ‌చ్చిన ఆదాయాల కంటే వ‌స్తువుల దిగుమ‌తి వ‌ల్ల వ‌చ్చిన ఆదాయం 27 శాతం ఎక్కువ‌గా ఉంది. అయితే, ఒకే నెల‌లో జీఎస్టీ రూ.ల‌క్ష కోట్లు దాట‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి కావడం మరో విశేషం.. 2019 డిసెంబర్‌ నెలతో పోలిస్తే.. 2020 డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 12 శాతం అధికంగా నమోదు అయ్యాయి.. కాగా, 2017, జులై 1వ తేదీ నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.