సరికొత్త రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు.. ఇదే తొలిసారి..

సరికొత్త రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు.. ఇదే తొలిసారి..

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత సరికొత్త రికార్డు సృష్టించింది... మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,23,902 కోట్లకు చేరినట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది.. జీఎస్టీ వసూళ్లలో ఇదే సరికొత్త రికార్డు కావడం విశేషం.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే మొదటిసారిగా పేర్కొంది ఆర్థికశాఖ.. గత 6 నెలలుగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటగా.. ఇప్పుడు ఆ రికార్డులు అన్నీ బద్దలు కొట్టేసింది.. ఇది గత ఆర్థిక సంవత్సరం మార్చిలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే.. ఏకంగా 27శాతం అధిమని కేంద్రం వెల్లడించింది. ఇక, మొత్తం వసూళ్లలో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ.22,973కోట్లుగా ఉండగా.. స్టేట్‌ జీఎస్టీ వాటా రూ.29,329 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది కేంద్రం. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూపంలో రూ.62,842 కోట్లు, సెస్సుల రూపంలో రూ.8,757 కోట్లు సమకూరినట్టు ప్రకటించింది. అన్ని రంగాలపై కోవిడ్ ప్రభావం చూపినా.. క్రమంగా కోలుకోవడం వల్లే.. ఇది సాధ్యం అయ్యిందంటున్నారు అధికారులు.