వంగవీటి రాధాతో కొడాలి నాని భేటీ అందుకేనా..?

వంగవీటి రాధాతో కొడాలి నాని భేటీ అందుకేనా..?

ఏపీ రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా పాలిటిక్స్‌లో మరో ఆసక్తికరపరిణామం చోటు చేసుకుంది. సీటు విషయంలో అలిగిన వంగవీటి రాధాకృష్ణ.. వైసీపీకి గుడ్‌బై చెప్పి... తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన సమయంలో ఆయనతో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని భేటీ అయ్యారు. ఈ భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు సన్నిహితులైన కాపు నేతలు కూడా పాల్గొన్నారు. అయితే, కొడాలి నాని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రాధా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో.. సార్వత్రిక ఎన్నికల ముందు వంగవీటితో నాని చర్చలు జరపడం కూడా చర్చనీయాంశంగా మారింది.