'మా అమ్మ ఆశలపై కేసీఆర్‌ నీళ్లు చల్లారు'

'మా అమ్మ ఆశలపై కేసీఆర్‌ నీళ్లు చల్లారు'

తమ ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే తాను ఎమ్మెల్సీ అయ్యేవాడినని కాంగ్రెస్‌ నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్.. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 'తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయడం కోసం తండ్రిగా కేసీఆర్‌ ఆశపడుతున్నారు. అలాగే నన్ను రాజకీయ నాయకుడిగా చూడాలని మా అమ్మ కూడా ఆశ పడింది. కానీ మా అమ్మ ఆశలపై కేసీఆర్‌ నీళ్లు చల్లారు' అని అన్నారాయన. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధం పాలన కొనసాగడం లేదన్న నారాయణరెడ్డి.. ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలన బాగుంటుందన్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినoదుకు రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి,  నేత భట్టి విక్రమార్కలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.