వైఎస్‌ఆర్‌ జలకళ : ఉచిత బోర్లకు మార్గదర్శకాలు ఇవే...

వైఎస్‌ఆర్‌ జలకళ : ఉచిత బోర్లకు మార్గదర్శకాలు ఇవే...

సీఎం జగన్‌ ఏ రోజు 'వైఎస్‌ఆర్‌ జలకళ' పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. అయితే ఈ ఉచిత బోర్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసారు. ''గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను ముందుగా వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి అవి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. తర్వాత అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. ఈ అనుమతి అనంతరం అక్కడి కాంట్రాక్టర్‌ బోరుబావులను తవ్వడం ప్రారంభిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్‌ వెల్‌ విఫలమైతే మరోసారి కూడా బోర్‌ వేస్తారు. అయితే వైఎస్‌ఆర్‌ జలకళ కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్‌ నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమం ను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌) ఏర్పాటు చేస్తారు. ఇక ఆ బోర్‌ వేయడం పూర్తయిన తరువాత చివరగా కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో డిజిటల్‌ ఫొటో ను తీస్తారు.