రైతు బీమా మార్గదర్శకాలు ఇవే..

రైతు బీమా మార్గదర్శకాలు ఇవే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుబంధు గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ కలిసి ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్ల వయసున్న రైతులు అర్హులు. ఈ పథకంలో చేరే రైతులు జీఎస్టీతో కలిపి ఏడాదికి రూ.2271 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనున్నది. రైతు చనిపోతే నామినీకి రూ.5 లక్షల బీమా అందుతుంది.