రైతులకు గుజరాత్‌ హైకోర్టు షాక్‌..

రైతులకు గుజరాత్‌ హైకోర్టు షాక్‌..

రైతులకు గుజరాత్‌ హైకోర్టు షాకిచ్చింది. భూసేకరణలో భాగంగా అక్కడి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని రద్దు చేసింది. మరోసారి సర్వే చేసి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. భావ్‌నగర్‌-వెరవల్‌, వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో భాగంగా రైతుల నుంచి జాతీయ రహదారుల సాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏఐ) భూములను సేకరించింది. ఇందుకు సంబంధించి రైతులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలవడంతో విచారించిన జస్టిస్‌ అనంత్‌ దావే, జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌లతో కూడి ధర్మాసనం.. ఆ పరిహారాన్ని రద్దు చేసింది.