కీచక టీచర్ కు పదేళ్ల జైలు శిక్ష..

కీచక టీచర్ కు పదేళ్ల జైలు శిక్ష..

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మృగాడిగా మారి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరకు న్యాయస్థానంలో నేరం రుజువు కావడంతో.. రూ.11వేల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. చన్ బు భగోరా అనే యువకుడు గుజరాత్ లోని దియోదర్ లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2017 ఆగస్టులో పాఠశాల బాలికపై అత్యాచారం చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం జరిపాడు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతానని హెచ్చరించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని దియోదర్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ ఠాకూర్ తెలిపారు. విచారణ జరిపిన పోలీసులు సెక్షన్ 376(అత్యాచారం), మరియు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. న్యాయస్థానంలో నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సమాజం తలదించుకునేలా ప్రవర్తించావంటూ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి పీటీ పటేల్ నిందితుడిపై మండిపడ్డారు.