వైరల్ వీడియో: మహాసముద్రాలు కలుస్తాయి. కానీ...

వైరల్ వీడియో: మహాసముద్రాలు కలుస్తాయి. కానీ...

మన ప్రపంచం ఎన్నో విచిత్రాలకు, వింతలకు నెలవు. ఇప్పుడు అలాంటి విచిత్రం గురించి తెలుసుకుందాం. గల్ఫ్ ఆఫ్ అలస్కా దగ్గర హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం కలుస్తాయి. రెండు మహాసముద్రాలు కలవనైతే కలుస్తాయి. కానీ వాటి నీరు కలవదు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో ఈ సముద్రాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు చూసినట్టయితే అన్నిటిలోనూ ఈ రెండు మహాసముద్రాలు కలుసుకోవడం చూడవచ్చు. కానీ రెండు సముద్రాల నీళ్ల రంగు పూర్తిగా వేర్వేరుగా ఉంటుంది. 

సాధారణంగా నీళ్లు ఎలా ఉన్నప్పటికీ వేరే నీటితో కలిసిపోతాయి. కానీ రెండు మహాసముద్రాల నీళ్లు ఒకదానితో మరొకటి కలవకపోవడం ఒక మిస్టరీగా మిగిలింది. ఆసక్తికరమైన సంగతేంటంటే రెండు సముద్రాల నీళ్లు ఒక చోటికి చేరినప్పటికీ కలవకుండా తమ తమ రంగులను అలాగే నిలుపుకుంటాయి. ఒక నీరు హిమానీనదం నుంచి వచ్చింది. దీని నీరు లేత నీలం రంగులో కనిపిస్తుంది. నదుల నుంచి వచ్చిన నీటి రంగు ముదురు నీలంగా ఉంటుంది. ఎక్కడైతే రెండు మహాసముద్రాలు కలుస్తాయో అక్కడ ఒక నురగ అడ్డుగోడగా ఏర్పడుతుంది. అక్కడ రెండిటి విభజన రేఖను స్పష్టంగా గుర్తించవచ్చు.

చాలా మంది పరిశోధకులు ఈ ప్రాంతంలో రీసెర్చ్ చేశారు. కానీ ఎవరూ దీనికి సరైన సమాధానం కనిపెట్టలేకపోయారు. రెండు సముద్రాల నీటి సాంద్రత, ఉష్ణోగ్రత, హిమానీనదం నీటి లవణీయత, తీరప్రాంత నీటి లవణీయతల మధ్య తేడాల వల్ల రెండు సముద్రాల నీళ్లు ఒకదానితో ఒకటి కలవడం లేదని కొందరు చెప్పారు. మరికొందరు మాత్రం ఈ వింతను మతవిశ్వాసాలకు ముడిపెడుతున్నారు. ఈ ప్రస్తావన మతగ్రంథాలు ఖురాన్, బైబిల్ లలో ఉన్నాయని చెబుతారు.