ఓల్డ్ సిటీలో కాల్పుల కలకలం.. భార్య, కొడుకుపై..!

 ఓల్డ్ సిటీలో కాల్పుల కలకలం.. భార్య, కొడుకుపై..!

హైదరాబాద్‌ ఓల్డ్ సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి... భార్యా పిల్లలపై కోపంతో లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు రియల్టర్‌.. పాతబస్తీ కలపత్తార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.. సయ్యద్‌ హబీబ్‌ హష్మీ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. అతడి భార్య కుమారులకు వివాహాలు చేద్దామని ఒత్తిడి చేసింది. తన కుమారులు ప్రయోజకులు కానిదే వివాహాలు చేయనని సయ్యద్‌ హబీబ్‌ హష్మీ చెప్పాడు. ఇంటికి సంబంధించిన పేపర్లు ఇవ్వమని కుమారులు, భార్య ఒత్తిడి చేయడంతో తన వద్ద ఉన్న రివాల్వర్‌తో ఇంట్లో గోడపైకి మూడు రౌండ్‌ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది.. తృటిలో తప్పించుకున్న బాధితులు.. కాల్పుల ఘటనలో కన్న తండ్రి హాబీబ్ హస్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఉమర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హాబీబ్ ను అదుపులోకి తీసుకున్నారు కలపత్తార్ పోలీసులు. మూడు రౌండ్ల బుల్లెట్‌లు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు.