అమరావతే రాజధాని...రేపు గుంటూరు జిల్లా బంద్ !

అమరావతే రాజధాని...రేపు గుంటూరు జిల్లా బంద్ !

రాజధాని వికేంద్రీకరణకు నిరసనగా అమరావతి రాజకీయ జేఏసీ రేపు గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. గుంటూరులో సమావేశమైన అమరావతి రాజకీయ జేఏసీ రేపు గుంటూరు జిల్లా బంద్‌ పై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, ఆప్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు మినహాయించి వ్యాపార, విద్యాసంస్థలు‌ సినిమా హాళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల స్వచ్ఛందంగా మూసివేయాలని ఈ సందర్భంగా జేఏసీ విజ్ఞప్తి చేసింది. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా బంద్‌కు జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో భాగమైన అసెంబ్లీతో పాటు పలు చోట్ల అదనపు బలగాలను మోహరిస్తున్నారు.