మా పోరాటం కేంద్రంపైన.. వారి పోరాటం మాపైన

మా పోరాటం కేంద్రంపైన.. వారి పోరాటం మాపైన

టీడీపీ కేంద్రంతో పోరాడుతుంటే వైసీపీ, జనసేన పార్టీలు మాత్రం టీడీపీపై పోరాటం చేస్తున్నాయన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. 2019 ఎన్నికలకు ముందు విజయవాడలో జరిగే చివరి మహానాడులో ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. బీజేపి అన్ని రాష్ట్రాల్లో కూడా కుట్ర పూరితమైన రాజకీయాలుచేస్తూ.. అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తోందన్నారు. మహానాడు ద్వారా తామంతా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని కార్యకర్తలకు తెలిగజేస్తున్నామన్నారు. కార్యకర్తల ద్వారా ఏపీ ప్రజలందరికీ కేంద్రం చేసిన అన్యాయాన్ని చాటుతామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జాతీయ స్థాయిలోని అన్ని ప్రాంతీయ పార్టీలను సమన్వయపరచడంలో కీలక పాత్ర పోచించనుందని గల్లా జయదేవ్ వెల్లడించారు.