నకిలీ సర్టిఫికెట్లతో ఆధార్ మోసాలు !

నకిలీ సర్టిఫికెట్లతో ఆధార్ మోసాలు !

గుంటూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో ఆధార్ కార్డుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు  రట్టు చేశారు.ఆధార్ కార్డుల్లో పేర్లు, వయసు మార్పులు చేస్తున్న ఎనిమిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు లబ్ధిదారుల వయసు మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పుట్టిన తేదీ, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను  నిందితులు మార్పులు చేశారన్నారు.

గెజిటెడ్ అధికారుల పేర్లు కలిగి ఉన్న సీల్, సంతకాలను ఫోర్జరీ చేసి, ఆధార్ కార్డులో మార్పులు చేసి వెబ్‌ సైట్‌ లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆధార్ ఏజెన్సీ నుంచి అనుమతి పొందిన ఓ దుకాణంలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లు , ఫోర్జరీ సంతకాలతో ఆధార్‌లో మార్పులు చేస్తున్నారని తేలింది.  రెండు నెలలుగా 500 మంది ఆధార్ కార్డుల్లో ఇలా మార్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల బ్యాంక్ ఎకౌంట్‌లు సీజ్ చేశామన్నారు. నిందితుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా బ్ధి దారుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.