కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా 125వ జయంతి

కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా 125వ జయంతి

ఆధునిక మహాకవి, కళా ప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా జయంతి నేడు . జాషువా 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ లో జన్మించారు. జాషువా తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మొదట సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వమే రాశారు. ఆ తర్వాత సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసా రు . కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకని సామ్రాట్‌గా ప్రసిద్ధులయ్యారు. పద్మభూషణా, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తు చరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నారు.