కోమటిరెడ్డి బ్రదర్స్‌పై గుత్తా సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి బ్రదర్స్‌పై గుత్తా సంచలన వ్యాఖ్యలు

నల్గొండల కోమటిరెడ్డి సోదరుల శకం ముగిసినట్టేనని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ల అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పు ఖాయంగా వస్తుందని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు జడ్పీలు, మెజారిటీ ఎంపీపీలు టీఆర్‌ఎస్‌వేనని, అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలిపించుకుంటామని చెప్పారు. 

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికపై కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు హాస్యాస్పదమన్న గుత్తా.. వారు మతిస్థిమితం లేని వ్యక్తులని ఎద్దేవా చేశారు. జిల్లాలోని ఉత్తమ్, జనారెడ్డిలు అనామకులుగా మారిపోయారని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ జీవితం చరమాకంలో ఉన్నదన్న ఆయన.. పిచ్చి పనులతో  ఓటమిని వాళ్లే కొనితెచ్చుకుంటారని అన్నారు. భువనగిరిలో లక్ష ఓట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి ఖాయమని అన్నారు.