'చైనాకా మాల్' అంటూ గుత్తా జ్వాలా పై విమర్శలు...

'చైనాకా మాల్' అంటూ గుత్తా జ్వాలా పై విమర్శలు...

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అని రంగాల పైన కనిపిస్తుంది. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా చైనాను చాల మంది విమర్శిస్తున్నారు. అలాగే చైనా వారు కనబడితే వారికి వివక్ష తప్పడం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కు ఏర్పడింది. గుత్తా జ్వాలను పరోక్షంగా కొంత మంది సోషల్ మీడియాలో విమర్శిస్తూ కొందరు 'హాఫ్ కరోనా'.. 'చైనాకా మాల్'.. 'హాఫ్ చైనీస్ చింకీ' అని విమర్శిస్తున్నారు. అయితే గుత్తా జ్వాల తండ్రి తెలుగువాడు కాగా.. తల్లి మాత్రం చైనా.. దీంతో కొంచెం చైనా లాగా కనిపిస్తున్నా గుత్తా జ్వాలకు ఈ వివక్ష తప్పలేదు. అయితే దీనిపై తాజాగా గుత్తా జ్వాల స్పందించింది. ఇది జాత్యాంహకార దాడి అని మండిపడింది. అసలు మమ్మల్ని కాదు ఉదయం వేళ కొందరు జాగింగ్ చేస్తూ కరోనా వ్యాప్తికి తోడ్పడుతున్నారు.. వారిని తిట్టండని గుత్తా జ్వాల నిప్పులు చెరిగింది.