గుత్తా జ్వాల అతడిని మిస్ అవుతుందంట...

గుత్తా జ్వాల అతడిని మిస్ అవుతుందంట...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం అందరికి తెగెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి ప్రజలు ఎవరు బయటికి రాకుండా సామజిక దూరం పాటించాలని తెలిపారు. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా చాల మంది తమ కుటుంబసభ్యులకు దూరంగా వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాల వచ్చింది. అయితే గుత్తా జ్వాల పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌తో విడిపోయిన విషయం అందరికి తెలిసందే. ఆ తరువాత తమిళ హీరో విష్ణు విశాల్‌ తో ప్రేమాయ‌ణం నడుపుతున్న విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఆ మధ్య వీరిద్దరూ ముద్దు పెట్టుకునే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై తనను ప్రశ్నించగా నా డేటింగ్ నా ఇష్టం అని సమాధానం ఇచ్చింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోనే ఉంటుంది జ్వాలా తమిళనాడులో ఉంటున్న విష్ణు విశాల్‌ ను మిస్ అవుతున్న అంటూ తన ట్విట్టర్ లో విష్ణు తో కలిసి దిగ్గిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తెలియజేసింది. అయితే జ్వాల ట్విట్ పైన స్పందించిన విశాల్ ఇప్పుడు అందరికి సామజిక దూరం అవసరం అంటూ తెలిపాడు. అయితే విష్ణు విశాల్ కూడా గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం అందరికి తెలిసిందే.