అతడితో డేటింగ్ లో ఉన్నది నిజమే..పెళ్లి కూడా చేసుకుంటాం: గుత్తా జ్వాలా

అతడితో డేటింగ్ లో ఉన్నది నిజమే..పెళ్లి కూడా చేసుకుంటాం: గుత్తా జ్వాలా

భారత బ్యాట్మింటన్ డబుల్స్ రంగంలో అనేక విజయాలు సాధించిన గుత్తాజ్వాల ప్రస్తుతం కోచింగ్ రంగంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్  కారణంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దక్షిణాది నటుడు విష్ణు విశాల్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్ చేసిన జ్వాలా "'నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అని ట్వీట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయిపొయింది. కాగా ఇప్పుడు ఆ విషయాన్ని  జ్వాలా అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్ తో డేటింగ్ చేస్తున్నది నిజమేనని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని స్పష్టం చేసింది. పెళ్లి తేదీ ఖరారైన తరువాత అందరికి తెలుపుతానని జ్వాలా ఓ ఆన్లైన్ పోర్టల్ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.