'మోడీ మరచిపోలేని కానుకు ఇచ్చారు..'

'మోడీ మరచిపోలేని కానుకు ఇచ్చారు..'

ఏపీ ప్రజల దశాబ్దాల కలను ప్రధాన మంత్రి మోడీ నిజం చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజలకు మోడీ మరచిపోలేని కానుకు ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం  చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ప్రత్యేక రేల్వే జోన్‌తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని.. మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విశాఖ రైల్వే జోన్‌ను సుసాధ్యం చేసిన మోడీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.