ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏంటి?

ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏంటి?

తిరుపతిలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం... కేంద్ర ఎన్నికల సంఘాన్ని అపహాస్యం చేస్తోందని అన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలు ఇలా చేయడం ఏం న్యాయం? అని ప్రశ్నించిన ఆయన తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక ఉన్నప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఏంటి? అని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేయాలని అనుకుంటున్నారా?, కోర్టు తీర్పును మేము గౌరవిస్తాం అని అన్నారు. రేపు ఎన్నికల రోజు అయినా భాజపా ప్రచారం చేస్తుందని, కోడ్ ఉల్లంఘన కింద పోలీసులు అరెస్ట్ చేస్తే చేసుకోండన్నారు. ఎస్ఈసీ నీలం సాహ్ని రాజ్యాంగ స్ఫూర్తి తో వ్యవహరించాలని అన్నారు. ఐఐటీ, ఐసర్ లు జాతీయ స్థాయి విద్యాసంస్థలు, కేంద్రం నిధులతో నిర్మితమవుతున్న సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ ఘనతగా ఎలా చెప్పుకుంటారు ? అని ఆయన ప్రశ్నించారు.

రేషన్ పంపిణీ వాహనాన్ని వైకాపా ప్రచారానికి వాడుకుంటున్నారన్న ఆయన సీఎం జగన్ పర్యటన వైకాపా భయానికి నిదర్శనం అని అన్నారు. భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ బెంగాల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి భాజపా చరిత్ర సృష్టించనుందని తమిళనాడు లో అన్నాడీఎంకే తో కలిసి ఎన్నికలను గెలవనున్నామని అన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ఫలితాలు భాజపా కి అనుకూలంగా రానున్నాయని, రాష్ట్రంలో వైకాపా ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. 24.8 శాతం వైకాపా అభ్యర్థులు ప్రజాస్వామ్యనికి విరుద్ధంగా పరిషత్ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారని టీడీపీ  పని అయిపోయినట్లు కనిపిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ, లోకేష్ ఇద్దరూ అన్నదమ్ముల్లాంటివారన్న ఆయన తిరుపతి లోక్ సభ నియోజకవర్గం అభివృద్ధి కోసం భాజపా కృషి చేసిందని అన్నారు. ప్రజలు కట్టే పన్నులతో వలంటీర్ల వ్యవస్థను నడపటం ఏంటి? బెంగాల్ లో మమతా బెనర్జీ ఇలాంటి విధానాలనే అమలు చేసిందని అన్నారు.