'హాథీ మేరే సాథీ' టీజర్.. అదరగొట్టిన రానా

'హాథీ మేరే సాథీ' టీజర్.. అదరగొట్టిన రానా

దగ్గుపాటి రానా హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'హాథీ మేరే సాథీ'. ఈ సినిమా బాలివుడ్ లో రూపొందుతుంది. హిందీ తో పాటు కన్నడ, తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. 

ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలో 'హాథీ మేరే సాథీ' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రానా సరసన జోయా హుస్సేన్, శ్రియ నటిస్తున్నారు. విష్ణు విశాల్, సామ్రాట్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.