మా పాత్ర లేదు... నిర్మలా సీతారామన్‌

మా పాత్ర లేదు... నిర్మలా సీతారామన్‌

రఫెల్‌ విమానాల కాంట్రాక్ట్‌లో భాగంగా ఆఫ్‌సేట్‌ భాగస్వామిగా రిలయన్స్‌ను ఎంపిక చేయడంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. భారత్‌ ఒత్తిడితోనే దసాల్ట్‌ కంపెనీ రిలయన్స్‌ను ఎంపిక చేసిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలెండ్‌ చేసిన వ్యాఖ్యలపై రక్షణ శాఖ ఓ ప్రతికా ప్రకటన విడుదల చేసింది.ఆఫ్‌సెట్‌ పార్ట్‌నర్‌గా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంలో తమ పాత్రలేదని గతంలో తాము చాలా సార్లు స్పష్టం చేశామని సీతారామన్‌ అన్నారు.