ఒంటిపూట బడులను పొడిగించిన ప్రభుత్వం

ఒంటిపూట బడులను పొడిగించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ఒంటిపూట బడులను మరో వారం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే వాతావరణ శాఖ మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని పేర్కొనడంతో ఒంటిపూట బడులు మరోవారం రోజుల పాటు పొడిగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. జూన్ 24 నుంచి యధాతధంగా ప్రకారం స్కూల్స్ పని చేస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.