రేపటి నుంచి ఒంటిపూట బడులు..

రేపటి నుంచి ఒంటిపూట బడులు..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో రేపటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అంటే మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ (చివరి పని దినం) వరకు తెలంగాణలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఇక పదో తరగతి పరీక్ష సెంటర్లు ఉన్న పాఠశాలల్లో... పరీక్ష జరిగే రోజుల్లో మధ్యామ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతలు నిర్వహిస్తారు.