ఫోటోస్ లీక్ అవడం బాధగా లేదు : హన్సిక

ఫోటోస్ లీక్ అవడం బాధగా లేదు : హన్సిక

మొన్నామధ్య పాపులర్ నటి హన్సిక మొబైల్ ఫోన్ ను ఎవరో హ్యాక్ చేసి ఆమె ప్రైవేట్ ఫోటోలను లీక్ చేశారు.  అందులో బికినీ ఫోటోలు కూడా ఉండటంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.  ఎవరో కావాలనే హ్యాక్ చేసి లీక్ చేశారని అప్పుడే హన్సిక చెప్పగా పాపులారిటీ కోసం ఆమే లీక్ చేసిందనే కామెంట్స్ వినబడ్డాయి. 

వాటికి సమాధానంగా బికినీ ఫోటోలను లీక్ చేసుకుని పాపులారిటీ తెచ్చుకునే ఖర్మ తనకు లేదని అంది.  అయినా ఫోటోలు లీక్ అవడం తనకు బాధగా లేదని, ఆ ఫోటోలు చాలా పాతవని వాటిలో కొన్నిటిని మార్ఫింగ్ చేశారని చెప్పుకొచ్చింది.