విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై కేంద్ర మంత్రి హన్స్ రాజ్ అహిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏజెన్సీ తప్పులు బయట పడ్డాయి. అధికారులు, మంత్రి తప్పు కూడా ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. తీసుకోకపోతే కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది' అని వ్యాఖ్యానించారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చేపట్టిన నిరవధిక దీక్షను ఇవాళ మంత్రి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని.. దేశంలో ఇంత మంది ఆత్మహత్య లు చేసుకోవడం ఇదే మొదటి సారి అని అన్నారు. సాధారణంగా రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని.. కానీ విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తాము జోక్యం చేసుకుంటామని చెప్పారు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రధాని మోడీ చూస్తూ ఊరుకోరని అన్నారు.  ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అహిర్‌ పిలుపునిచ్చారు.