ద్రావిడ్, పుజారా రికార్డులను బద్దలు కొట్టిన విహారి...

ద్రావిడ్, పుజారా రికార్డులను బద్దలు కొట్టిన విహారి...

సిడ్నీ వేదికగా భారత్--ఆసీస్ మధ్య జరిగిన మూడో టెస్ట్ డ్రా అయిన విషయం తెలిసిందే. అయితే ఓడిపోతాము అనుకున్న ఈ మ్యాచ్ ను భారత్ డ్రా ముగించుకోవడంలో జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ హనుమ విహారి కృషి చాలా  ఉంది. తన తర్వాత బ్యాటింగ్ కు రావాల్సిన ఆల్ రౌండర్ ఆటగాడు గాయపడటంతో... ఆసీస్ బౌలింగ్ ను ఎదుర్కొని బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు తన తర్వాత లేరు అని అర్ధం చేసుకున్న విహారి మొదటి బంతినుండే డిఫెన్స్ లోకి దిగిపోయాడు. ఈ క్రమంలోనే ద్రావిడ్, పుజారా రికార్డులను బద్దలు కొట్టాడు. అయితే విహారి మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ 100 బంతులను ఎదుర్కొని 6 పరుగులు చేసాడు. అయితే ఇలా ఆడితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో విమర్శలకు గురవుతారు. కానీ టెస్ట్ క్రికెట్ లో.. అది కూడా బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు లేని సమయంలో ఇలా ఆడితే ప్రశంసలు పొందుతారు. ఇక మ్యాచ్ మధ్యలో తన చేతికి గాయమైన కూడా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ మ్యాచ్ మొత్తంలో 161 బంతులు ఎదుర్కున్న విహారి 4 ఫోర్లతో 23 పరుగులు చేసాడు. 

ఈ క్రమంలోనే విహారి ఆట పై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తన ట్విట్టర్ లో ''విజయలక్ష్మి గారు మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు'' అని  విహారి అమ్మ పేరుతో  తెలుగులో ట్విట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారింది.