విహారి సూపర్‌ సెంచరీ..

విహారి సూపర్‌ సెంచరీ..

తెలుగు తేజం హనుమ విహారి మరోసారి మెరిశాడు. ఇరానీ ట్రోఫీలో భాగంగా రంజీ విజేత విదర్భపై శతకం  (211 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) నమోదు చేశాడు. విహారితోపాటు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (95) రాణించడంతో రెస్టాఫ్‌ ఇండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌ అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (15) స్వల్ప స్కోరుకే అవుటైనా.. మయాంక్‌తో కలిసి విహారి రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం విడిపోయాక ఆ జట్టు పట్టు కోల్పోయింది. ఓ ఎండ్‌లో విహారి నిలిచినా.. మరోవైపు కెప్టెన్‌ అజింక్య రహానె (13), శ్రేయస్‌ అయ్యర్‌ (19), ఇషాన్‌ కిషన్‌ (2) విఫలమయ్యారు. అంకిత్‌ రాజ్‌పుత్‌ (25) సహకారంతో జట్టు స్కోరును విహారి 300 దాటించాడు. చివర్లో రాహుల్‌ చాహర్‌ (22) కీలక రన్స్‌ చేశాడు. విదర్భ బౌలర్లలో అక్షయ్‌ వాఖరె (3/62), సర్వాతె (3/99), గుర్బాని (2/58) సత్తా చాటారు.