సెయింట్‌ ఆండ్రూస్‌లో విహారి సందడి

సెయింట్‌ ఆండ్రూస్‌లో విహారి సందడి

టీమిండియా యువ క్రికెటర్‌ హనుమ విహారి బోయిన్‌పల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ స్కూల్‌లో సందడి చేసాడు. మంగళవారం సెయింట్‌ ఆండ్రూస్‌ స్కూల్‌లో క్రీడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా హనుమ విహారి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను చదువుకున్న క్లాస్‌ రూమ్‌లకు, ప్రాక్టీస్‌ చేసిన మైదానాన్ని సందర్శించి గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

స్కూల్‌లోని టీచర్లను పలకరించి విద్యార్థులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. అనంతరం విద్యార్థులతో కలిసి సెల్ఫీలు కూడా దిగాడు. అక్కడే చదువుకున్న విహారి పాఠశాలకు రావడంతో.. సందడి వాతావరణం నెలకొంది. అనంతరం స్కూల్ యాజమాన్యం విహారిని ఘనంగా సన్మానించారు. సెయింట్‌ ఆండ్రూస్‌ క్రికెట్‌ జట్టుకు హనుమ విహరి ఐదేళ్లు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు సెయింట్‌ ఆండ్రూస్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.