ఇవాళే హనుమాన్‌ శోభాయత్ర..

ఇవాళే హనుమాన్‌ శోభాయత్ర..

హనుమాన్ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామాలయం వద్ద యాత్ర ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వరకు కొనసాగుతుంది. గౌలిగూడ, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ బాటా, బైబిల్ హౌస్ మీదుగా తాడ్ బండ్ వరకు సుమారు 13 కిలోమీటర్లు శోభాయాత్ర సాగనుంది.

 శోభాయత్ర కోసం 8,000 మంది సిబ్బంది.. 400 సీసీ కెమెరాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా నిఘా పెడుతున్నారు. ఇక.. వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లను ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకూ మూసి వేయించబోతున్నారు. శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ తెలిపారు.