బర్త్ డే : నవ్వుల వెన్నెల కురిపిస్తాడు ఈ కిషోర్

బర్త్ డే : నవ్వుల వెన్నెల కురిపిస్తాడు ఈ కిషోర్

కమెడియన్ గా తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు వెన్నెలకిషోర్ . బ్రహ్మానందం , అలీ తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పూయించగల నటులలో వెన్నెల కిషోర్ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవించే వెన్నెల కిషోర్ పుట్టిన రోజు నేడు. వెన్నెల సినిమాతో సినిమా తెరకు పరిచయమైనా  కిషోర్ . 2009లో  "బిందాస్" తోహిట్ అందుకున్నఆయన  అప్ప‌ట్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు‌. ఆతర్వాత దూకుడు సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో దాదాపు వెన్నెల కిషోర్ లేకుండా లేవు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన కామెడీని ప్రేక్షకులు ఎంతలా కావాలనుకుంటున్నారో. డిఫెరెంట్ మాడ్యులేష‌న్.. మొహంలోనే క‌నిపించే ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో విచిత్ర‌మైన ఇంగ్లీష్ ప‌దాలు.. అద్భుత‌మైన కామెడీ టైమింగ్.. ఇవ‌న్నీ వెన్నెల కిషోర్ సొంతం. గ‌త రెండేళ్లుగా వెన్నెల కిషోర్ చేస్తున్న ప్ర‌తీ పాత్ర సంచ‌ల‌న‌మే అవుతుంది. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో ఆయ‌నే కామెడీ మొత్తం లీడ్ చేస్తున్నాడు.