హ్యాపీ బర్త్ డే నాగచైతన్య 

హ్యాపీ బర్త్ డే నాగచైతన్య 

అక్కినేని నటవారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2009లో జోష్ సినిమాతో పరిచయమయ్యాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా.. పర్వాలేదనిపించింది.  అక్కినేని వారసుడితో జోష్ ఉందనిపించింది.  ఈ సినిమాతో ఫిలిం ఫేర్, నంది అవార్డును సొంతం చేసుకున్నాడు నాగ చైతన్య. 

చైతు అటు తమిళంలో విణ్ణైతాండి వరువాయా సినిమాలో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు.  ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకుడు.  ఇదే సినిమాను తెలుగులో ఏం మాయ చేశావే పేరుతో రీమేక్ చేశారు.  ఇందులో నాగచైతన్య, సమంతలు జంటగా నటించారు.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఫిలిం ఫేర్ అవార్డుకు నామినేట్ కూడా అయ్యింది.  ఆ తరువాత 2011లో వచ్చిన 100% లవ్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు.  ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు చైతు.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.  కెరీర్లో ప్లాప్ లు అందుకుంటున్నా, ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. తన నుంచి ఫ్యాన్స్ కు ఏం కావాలో అది అందిస్తూ హీరోగా తనను తాను నిలబెట్టుకుంటున్నారు చైతు.  మజిలీ సినిమాలో తన నటన అంటే ఎలా ఉంటుందో చూపించి మెప్పించాడు.  ప్రస్తుతం అక్కినేని హీరో వెంకీ మామ చేస్తున్నాడు.  అటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమాలో కూడా చైతు నటిస్తున్నాడు.  కాగా, నవంబర్ 23న చైతు పుట్టినరోజు.  ఇలాంటి పుట్టినరోజులు ఈ అక్కినేని హీరో మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.