హ్యాపీ బర్త్ డే ఆలీ 

హ్యాపీ బర్త్ డే ఆలీ 

ఆలీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు.  ఇప్పటి వరకు దాదాపుగా 1100 సినిమాల్లో నటించారు.  చిన్నతనంలోనే సినిమాలపై మక్కువతో మద్రాస్ వెళ్లి.. సినీరంగంలో జాయిన్ అయ్యారు. సీతాకోక చిలుక సినిమా మంచిపేరు తెచ్చిపెట్టింది.  అక్కడి నుంచి అలీ వరసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.  కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆలీ.. హీరోగా చేసిన యమలీల సినిమా మంచి విజయం సాధించింది.  ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలు చేశారు.  

ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కమెడియన్ గా కంటిన్యూ అయ్యారు.  ఇటీవల కాలంలో ఆలీ టీవీ టాక్ షోలతో బిజీ అయ్యారు.  సినిమాలు తగ్గించేశారు.  గోదావరి జిల్లా రాజమండ్రిలో అలీ జన్మించారు.  వీరి కుటుంబం గతంలో బర్మాలో వ్యాపారం చేసేవారు.  రెండో ప్రపంచయుద్ధం సమయంలో బర్మా నుంచి తిరిగి ఇండియా వచ్చారు.  ఆలీ చిన్న తనం నుంచి చదువుపై పెద్దగా దృష్టిపెట్టలేదు.. నటనపై మక్కువతో మిమిక్రి బృందంలో కళాకారుడిగా జాయిన్ అయ్యారు.  తన కళను ప్రదర్శిస్తూ జీవనం సాగించే ఆలీకి కె విశ్వనాద్ ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో చిన్న వేషం దక్కింది.  ఆ సినిమాలో నటించిన ఆలీకి మంచి పేరు వచ్చింది.  ఆ తరువాత భారతీరాజా దర్సకత్వంలో వచ్చిన సీతాకోక చిలుకతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.  అక్కడి నుంచి అయన వెనక్కితిరిగి చూసుకోలేదు.  సినిమాల్లో నవ్వులు పూయించిన అలీ పుట్టినరోజు నేడు. అందరిని నవ్విస్తూ.. మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుందాం.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Here's wishing Comedian Ali Many More Happy Returns of the Day!! #HappyBirthdayAli #HBDAli #NtvEntertainment

A post shared by Ntv Telugu Entertainment (@ntvteluguent) on