హ్యాపీ బర్త్ డే ఆసిన్ 

హ్యాపీ బర్త్ డే ఆసిన్ 

ఆసిన్ తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు.  2003లో పూరి జగన్నాథ్ అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.  అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆసిన్ వరసగా శివమణి, లక్ష్మినరసింహ,ఘర్షణ, చక్రం, గజినీ, అన్నవరం సినిమాలు చేసింది.  తెలుగులో ఆమె చేసిన ఆఖరు సినిమా అన్నవరం.  ఆ సినిమా తరువాత తెలుగులో సినిమాలు చేయలేదు.  

తెలుగులో మంచి విజయాలు సొంతం చేసుకున్నా, ఆసిన్ తెలుగు కంటే తమిళ్, హిందీ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ చేసింది.  2015లో వచ్చిన అల్ ఈజ్ వెల్ ఆమె ఆఖరి సినిమా ఆ తరువాత సినిమాలు చేయలేదు.  2016లో రాహుల్ శర్మను వివాహం చేసుకుంది.  కేరళలోని కొచ్చిలో జన్మించిన ఆసిన్ .. చిన్న తనం నుంచే నటనపై ఆసక్తి కనబరిచేది.  తండ్రి వ్యాపారాల నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చినపుడు తండ్రితోపాటుగా ఆసిన్ కూడా అనేక ప్రాంతాల్లో పర్యటించింది.  ఆమెకు మొదటి అవసరం మలయాళం సినిమాలోనే వచ్చింది.  ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.  2016 లో వివాహం చేసుకొని లైఫ్ లో సెటిలైన ఆసిన్ పుట్టినరోజు నేడు.  ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుందాం.