హ్యాపీ బర్త్ డే ప్రభాస్  

హ్యాపీ బర్త్ డే ప్రభాస్  

ప్రభాస్.... పేరుకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా ప్రభాత కిరణాలను ప్రసరింపజేస్తూ.. పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  2002లో ఈశ్వర్ సినిమాతో కృష్ణంరాజు వారసుడుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.  ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2004లో వచ్చిన వర్షం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  సాంగ్స్ తో పాటు కథ కూడా అద్భుతంగా ఉండటంతో ప్రభాస్ కు సార్ ఇమేజ్ ను తెచ్చిపెటింది సినిమా.   ఆ తరువాత ఈ యువహీరో చేసిన అడవిరాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి.  

ఇక 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ను మార్చేసింది.  మాస్ హీరోగా ప్రభాస్ ను నిలబెట్టింది.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది.  ఆ తరువాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ మూడు ఫెయిల్ కాగా, పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  అనంతరం వచ్చిన రెండు సినిమాలు భిల్లా, ఏక్ నిరంజన్ సినిమాలు ఫెయిల్ కాగా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు వరసగా హిట్ కొట్టాయి.  దీనితర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో చెప్పక్కర్లేదు.  బాహుబలి- ది బిగినింగ్, బాహుబలి 2 సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు సాధించాయి.  

ఒక ప్రాంతీయ సినిమా దాదాపుగా రెండువేల కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించి సత్తా చాటింది.  ప్రపంచంలోని అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది.  ఇక 148 సంవత్సరాల చరిత్ర కలిగిన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి ది బిగినింగ్ ను ప్రదర్శించారు.  ఇది ఇండియన్ సినిమాకు కలిగిన గొప్ప గౌరవంగా చెప్పొచ్చు.  ఇటీవలే సుజిత్ దర్శకత్వంలో చేసిన సాహో సినిమా రిలీజ్ అయ్యింది.  యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడినా వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోవడం విశేషం.  ప్రస్తుతం ప్రభాస్ పీరియాడికల్ స్టోరీతో జాన్ సినిమా చేస్తున్నారు.ఇదిలా ఉంటె, నేడు ప్రభాస్ పుట్టినరోజు.  ప్రభాస్ ఫ్యాన్స్ పుట్టినరోజును అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.  ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.