హ్యాపీ బర్త్ డే యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయ

హ్యాపీ బర్త్ డే యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయ

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యాంగ్ హీరో  కార్తికేయ . ఈ సినిమాలో కార్తికేయ నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయిపోయారు. నేడు ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో పుట్టిన రోజు . ఆర్ఎక్స్ 100  తర్వాత "హిప్పీ" అనే సినిమా చేసాడు కార్తికేయ ఆ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. గుణ 369, 90ఎంఎల్ చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు. ఇక ఆతర్వాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే తాను నటుడిగా మారాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు కార్తికేయ. మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ లో నిర్మించిన "ప్రేమతో మీ కార్తీక్" చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది .  ఆ తరువాత అదే బ్యానర్ పై అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం భారీ విజయాన్ని సాధించాడు. కార్తికేయ ప్రస్తుతం కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి డార్క్ కామెడీ కథతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న “చావు కబురు చల్లగా” లో నటిస్తున్నారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.