హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్ 

హ్యాపీ బర్త్ డే కీర్తి సురేష్ 

కీర్తి సురేష్ పేరు వినగానే మనకు మహానటి సినిమా గుర్తుకు వస్తుంది.  మహానటి సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డు దక్కింది.  తక్కువ సమయంలోనే జాతీయ అవార్డును సొంతం చేసుకున్న మహానటి కీర్తి సురేష్ సినిమా పరిశ్రమకు 2000 సంవత్సరంలో బాలనటిగా పరిచయం అయ్యింది. పైలట్స్ అనే మలయాళ చిత్రంలో అనే బాలనటిగా కనిపించింది.  ఆ తరువాత బాలనటిగా కొన్ని సినిమాలు చేసింది.  

కాగా, ఫాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.  2013లో మలయాళంలో వచ్చిన గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  అయితే, 2016లో తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయం అయ్యింది.  ఈ సినిమా డీసెంట్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఆ ఏడాది తెలుగులో చేసిన సినిమా అదొక్కటే కావడం విశేషం. అయితే, తమిళంలో ఈ అమ్మడు వరసగా బిజీకావడంతో తెలుగు సినిమాలు చేయలేకపోయింది.  2018లో తన రెండో సినిమా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చేసింది.  ఈ సినిమా హిట్టయ్యి ఉంటె మరోలా ఉండేది.  కానీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో పాపం ఈ అమ్మడు ఇబ్బందులు పడింది.  సినిమా భారీ ప్లాప్ అయ్యింది.  ఆ తరువాత అదే ఏడాది సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది.  ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది.  ఈ సినిమా తరువాత తెలుగులో ఓ సినిమా, అటు బాలీవుడ్ లోను సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యింది.  సౌత్ లో ఫుల్ బిజీ అయిన కీర్తి సురేష్ పుట్టినరోజు ఈరోజు.  ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.