హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

ఆగస్టు 22 వచ్చింది అంటే మెగాస్టార్ అభిమానులకు పండుగే పండుగ.  కొన్నేళ్ల క్రితం ఈ హంగామా ఎక్కువగా ఉండి.  ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ, రేడియో అన్నింట్లోనూ మెగాస్టార్ పాటలతో నిండిపోయేవి.  అభిమాన సంఘాల నాయకులు హంగామా చేసేవాళ్ళు.  2007 వరకు ఈ హంగామా జోరుగా సాగింది.  2008 లో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఆ స్పీడ్ కాస్త తగ్గిందని చెప్పాలి.  అందరివాడుగా ఉన్న మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లి కొందరివాడుగా మారిపోయాడు.  చిరంజీవి కూడా తన పుట్టిన రోజు వేడుకలపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు.  కారణం రాజకీయాల్లో బిజీ కావడమే.  

అయితే, 2015 తరువాత మరలా పూర్తిగా మారిపోయింది.  2015లో మెగాస్టార్ తన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రారంభించాడు.  2017 జనవరి 11 న సినిమా రిలీజ్ అయ్యింది.  సూపర్ హిట్ కావడమే కాకూండా మెగాస్టార్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.  అదే ఏడాది అంటే 2017 లో మెగాస్టార్ తన 151 వ సినిమా సైరాను మొదలుపెట్టారు.  ఈ సినిమా టీజర్ మోషన్ టీజర్ కూడా అప్పుడే రిలీజ్ చేశారు.  ఆ తరువాత కొని రోజులకు ఫస్ట్ టీజర్ రిలీజ్ చేశారు.  ఇక 2019 ఆగష్టు 14 వ తేదీన సైరాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.  ఆ మేకింగ్ వీడే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.  ఆగస్ట్ 20 న ముంబైలో మెగాస్టార్ సైరా టీజర్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  మెగాస్టార్ పుట్టినరోజైన నేడు తన 152 వ సినిమాను ప్రకటించబోతున్నారు.  

ఏడేళ్లపాటు సినిమాకు దూరమై.. తిరిగి సినిమాల్లోకి వచ్చిన తరువాత తన సినిమాను ప్రేక్షకుల ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ద్వారా రుజువు చేశారు.  ఈసారి కూడా ఎప్పటిలాగే ఓ రోజు ముందుగానే మెగాస్టార్ బర్త్ డే సంబరాలు జరిగాయి.  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ఈరోజు బర్త్ డే సందర్భంగా సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.  ఇలాంటి పుట్టినరోజు మెగాస్టార్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.