హ్యాపీ బర్త్ డే మెహ్రీన్ 

హ్యాపీ బర్త్ డే మెహ్రీన్ 

మెహ్రీన్ నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మోడల్ గా రాణించింది.  అనేక షోస్ లో మోడల్ గా మెప్పించింది.  2016లో వచ్చిన నాని సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడంతో మెహ్రీన్ కు వరసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.  

మహానుభావుడు, రాజాధి గ్రేట్, జవాన్, పంతం, కవచం, ఎఫ్ 2, చాణక్య సినిమాలు చేసింది.  ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ఎంత మంచివాడవురా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.  తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది మెహ్రీన్.  ఈరోజు మెహ్రీన్ పుట్టినరోజు.  ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుందాం.