నాగశౌర్యను సర్‌ఫ్రైజ్‌ చేసిన "వరుడు కావలెను" టీం..

నాగశౌర్యను సర్‌ఫ్రైజ్‌ చేసిన "వరుడు కావలెను" టీం..

చిత్ర కథానాయకుడు ‘ నాగ శౌర్య‘ పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘ వరుడు కావలెను‘ చిత్రం యూనిట్ ఓ అందమైన, ఆకర్షణీయమైన వీడియో చిత్రం ను విడుదలచేశారు.  ఈ చిత్రం లో అందమైన కథానాయకుడు నాగ శౌర్య మరింత అందంగాఅలంకరించుకోవడం, ముస్తాబవుతున్న దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.  వీడియో చివరలో 2021 మే నెలలో చిత్రం విడుదల అవుతుందన్న విషయం కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు లాగానే ఈ వీడియో చిత్రానికి  చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో ను కూడా ఇటీవల  విడుదల చేశారు. ఈ వీడియో లో కూడా నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాదు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా  లభించాయి. .ఆ తరువాత 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఓ  ప్రచారచిత్రం విడుదల చేశారు.ఈ చిత్రంలో చూడ ముచ్చటగా  'నాగ శౌర్య , రీతువర్మ' ల జంట కనిపిస్తుంది. ఇవన్నీ ప్రేక్ష కాభి   మానులను మరెంత గానో అలరించాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.