హ్యాపీ బర్త్ డే నాగబాబు 

హ్యాపీ బర్త్ డే నాగబాబు 

సినిమా ఇండస్ట్రీలో నాగబాబు గురించి అందరికి తెలుసు.  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.  సహనటుడిగా కొన్ని సినిమాల్లోకి చేసిన నాగబాబు, ఆ తరువాత రుద్రవీణ సినిమాతో నిర్మాతగా మారారు.  1988లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.  ఈ సినిమా తరువాత మెగాస్టార్ తో త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, స్టాలిన్ సినిమాలు తీశారు.  

తమ్ముడు పవన్ కళ్యాణ్ తో గుడుంబాశంకర్, అన్న కొడుకు రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా తీశాడు.  అయితే, నాగబాబు నిర్మాతగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.  ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేస్తున్నారు.  మరోవైపు టీవీ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయారు.  అన్న స్థాపించిన ప్రజారాజ్యం, తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు నాగబాబు.  1961 అక్టోబర్ 29 వ తేదీన నాగబాబు మొగల్తూరూలో జన్మించారు. ఈరోజు నాగబాబు పుట్టినరోజు.  ఇలాంటి పుట్టినరోజులు ఈ మెగాహీరో మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.