విలక్షణ నటి నందితా దాస్...

విలక్షణ నటి నందితా దాస్...

నేడు విలక్షణ నటి నందితా దాస్ పుట్టిన రోజు. ఆమె పది వేర్వేరు భాషలలో 40 కి పైగా చిత్రాలలో నటించింది. నందితా కేవలం నటి మాత్రమే కాదు... దర్శకురాలు కూడా. 2008 లో ఫిరాక్ అనే సినిమాకు మొదటిసారిగా దర్శకత్వం వహించారు . ఈ సినిమా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఆమె 2018 లో మాంటో అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో దాస్ రెండుసార్లు (2005, 2013) పనిచేశారు. అలాగే వాషింగ్టన్ డీసీ లోని ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫోరం యొక్క ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి భారతీయ మహిళగా దాస్ చరిత్ర సృష్టించారు. ఇక ప్రస్తతం నందితా దాస్.. రానా దగ్గుపాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.