హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్

హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్

ఎన్టీఆర్... రామాయణం సినిమాతో నేషనల్ అవార్డును అందుకొని, నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అవతరించాడు.  ఈ సినిమా తరువాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.  అక్కడి నుంచి ఎన్టీఆర్ తన జైత్రయాత్ర కొనసాగించాడు.  కెరీర్లో ఆది, సింహాద్రి, యమదొంగ, సాంబ, అదుర్స్, బృందావనం, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.  టెంపర్ తరువాత ఎన్టీఆర్ కు ఫెయిల్ లేదు. 

ఇప్పుడు రాజమౌళితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  చారిత్రాత్మక కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవరసాలను తనలో పలికించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.  చిన్నతనంలో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడంతో సినిమాల్లో అది బాగా ఉపయోగపడింది.  మంచి డ్యాన్సర్ కూడా.  డైలాగ్స్ చెప్పడంతో పెద్ద ఎన్టీఆర్ కు ఏ మాత్రం తీసిపోడు.  ఈరోజు అంటే మే 20 వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు.  మాములుగా ఎన్టీఆర్ పుట్టినరోజును ఫ్యాన్స్ అద్భుతంగా జరుపుతుంటారు.  కానీ, ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించడంతో ఆయన ఈ వేడుకలకు దూరంగా ఉన్నాడు.