ప్రభుదేవా 'రామాయణం'!

ప్రభుదేవా 'రామాయణం'!

కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా ఎన్నో సినిమాలకు పని చేసిన ప్రభుదేవా ఈరోజు తన 45వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా... తన మనసులో కోరికను వెల్లడించారు ప్రభుదేవా. దర్శకుడిగా రామాయణాన్ని తెరకెక్కించాలనేది తన డ్రీమ్ అని స్పష్టం చేశాడు. సినిమాలు, డాన్స్ తప్ప మరో ప్రపంచం తెలియదని ఎప్పటికైనా.. భారీ బడ్జెట్ తో రామాయణాన్ని తెరకెక్కిస్తానని అన్నారు. అది కూడా హాలీవుడ్ సినిమా 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' రేంజ్ లో. తను అనుకున్నట్లుగా సినిమా చేయాలంటే కనీసం రూ.500 నుండి రూ.600 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, మరో ఐదారేళ్ళలో సౌత్ సినిమాను ఆ రేంజ్ లో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడే 'రామాయణం' సినిమా చేస్తానని అన్నారు. రీసెంట్ గా అల్లు అరవింద్ కూడా భారీ బడ్జెట్ తో రామాయణం చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నయంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు!