హ్యాపీ బర్త్ డే డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ 

హ్యాపీ బర్త్ డే డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ 

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ . సినీ పరిశ్రమలో త‌న కంటూ సెప‌రేట్ మార్క్ క్రియేట్  చేసుకున్నాడు . పూరి మార్క్ అంటూ ఓ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ డైలాగ్ బ్లాస్టర్ కు హీరోల మాదిరిగానే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విప‌రీతంగానే ఉంది. హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తతన కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకునేలా సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నాడు పూరి. సెప్టెంబ‌ర్ 28 1966 లో జ‌న్మించిన పూరీ 2000 సంవ‌త్స‌రంలో ఫ‌స్ట్ టైం మెగా ఫోన్ ప‌ట్టిన పూరి మొద‌టి సినిమానే పవ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తో తీయ‌డమే కాకుండా ప‌వ‌ర్ స్టార్ కు బ‌ద్రీ రూపంలో భారీ విజ‌యాన్ని అందించాడు.. కాని ఆ స‌క్సెస్‌ను బాచీ సినిమాతో కంటిన్యూ చేయ‌లేక పోయాడు. ఆ త‌రువాత ర‌వితేజ హీరోగా ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం లాంటి ల‌వ్ స్టోరీతో ట్రాక్ లోకి వ‌చ్చాడు. ఇడియ‌ట్ త‌రువాత అమ్మా నాన్న ఓ త‌మిళ‌ అమ్మాయి,శివ‌మ‌ణి లాంటి బ్లాక్‌బాస్ట‌ర్ హిట్లు కొట్టి టాప్ డైరెక్ట‌ర్ అయ్యారు పూరీ.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు . పోకిరి సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది . ర‌వితేజ్‌తో నేనింతే సినిమా తీసి నందీ అవార్డు సైతం అందుకున్నాడు. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు పూరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.