హ్యాపీ బర్త్ డే రకుల్ ప్రీత్ సింగ్ 

హ్యాపీ బర్త్ డే రకుల్ ప్రీత్ సింగ్ 

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ పంజాబీ బ్యూటీ.  అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.  ఈ సినిమా తరువాత వరసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది.  ఒక్క తెలుగుపై మాత్రమే కాకూండా.. మిగతా ఇండస్ట్రీలపై కూడా కన్నేసింది ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, కన్నడ, అటు హిందీ పరిశ్రమలో కూడా సినిమాలు చేసింది.  

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే రీతిలో రకుల్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది.  ఎఫ్ 45 పేరుతో జిమ్ ను స్థాపించి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది.  ప్రతి మనిషి ఫిట్ గా ఉండటం ముఖ్యం.. ఫిట్ గా ఉంటేనే లైఫ్ లో ఏదైనా సాధించేందుకు అవకాశం ఉంటుంది అనే థీమ్ తో జిమ్ వ్యాపారంలోకి ప్రవేశించిన రకుల్ అక్కడ మంచి సక్సెస్ అయ్యింది.  ప్రస్తతం ఈ అమ్మడు శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నది.  అక్టోబర్ 10, 1990లో ఢిల్లీలో పుట్టిన ఈ బ్యూటీ.. మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది రకుల్.  

చదువుకునే సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరికతో సినిమా రంగంలోకి అడుగుపెటింది.   ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలా వచ్చిన డబ్బును తన అవసరాలకు, చదువుకు ఉపయోగించుకున్న రకుల్..  తరువాత బిఎస్సి డిగ్రీ చేసింది. ఒక్క సినిమా రంగంలోనే కాదు క్రీడా రంగంలో కూడా రకుల్ రాణించింది. రకుల్ జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.  ఎన్నో రంగాల్లో రాణిస్తున్న రకుల్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Join us in wishing Gorgeous Rakul Preet A Very Happy Birthday!! #HappyBirthdayRakulPreet #HBDRakulPreet

A post shared by Ntv Telugu Entertainment (@ntvteluguent) on