హ్యాపీ బర్త్ డే వెండితెర మహానటి సావిత్రి 

హ్యాపీ బర్త్ డే వెండితెర మహానటి సావిత్రి 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా వెలుగొంది మహానటిగా పేరు తెచ్చుకున్న నటి  నిశ్శంకర సావిత్రి... సినిమా పై మక్కువతో పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్యతో కలిసి మద్రాస్ నగరం వచ్చి సినిమా కష్టపడి సినిమా అవకాశాలు దక్కించుకొని తనలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించి వెండితెరపై ఆణిముత్యాల్లాంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించింది.  సావిత్రి జీవితం వెండితెరపై ఎంతగా వెలుగొందిందో... నిజజీవితంలో మాత్రం విషాదం నిండింది.  1950లో వచ్చిన సంసారం సినిమా నుంచి 1979లో వచ్చిన గోరంటాకు సినిమా వరకు మొత్తం 83 చిత్రాల్లో సావిత్రి నటించింది.  1950లో సంసారం సినిమాలో నటించినా.. అది చిన్న పాత్రే.  ఆ తరువాత చేసిన మరో ఐదు సినిమాలు కూడా చిన్న చిన్న సినిమాలే.  అయితే 1953లో ఆమె మెయిన్ హీరోయిన్ గా అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి చేసిన దేవదాస్ సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.  అప్పటి నుంచి ఆమె వరసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది.  

నటిగా మాత్రమే కాకుండా సావిత్రి దర్శకురాలిగా ఆరు సినిమాలు చేసింది.  అటు హిందీలో సావిత్రి కొన్ని సినిమాలు చేసింది.  సినిమాల్లో హవా సాగిస్తున్న సమయంలోనే ఆమె శివాజీ గణేష్ ను వివాహం చేసుకుంది.  వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.  డిసెంబర్ 6, 1935లో పుట్టిన గుంటూరు జిల్లాలోని చిర్రావూరులో పుట్టిన సావిత్రి 1981 డిసెంబర్ 26 వ తేదీన సావిత్రి మరణించింది.  ఆమె చివరిరోజుల్లో దయనీయమైన స్థితిలో  ఉండటం విశేషం.  ఇక సావిత్రికి  మల్లెపూలు, వర్షం సావిత్రికి ఇష్టమైనవి. ఆమెది ఎడమ చేతివాటం. క్రికెట్, చదరంగం ఆటలను బాగా ఇష్టపడేది. చెన్నైలో క్రికెట్ మ్యాచ్ ఉంటే ఆమె తప్పక చూసేది. వెస్టిండీస్ ప్రముఖ ఆటగాడు "గ్యారీ సోబర్స్"కు సావిత్రి అభిమాని. ఆ రోజుల్లోనే శివాజీగణేశన్ తోపాటు తారల క్రికెట్లో పాల్గొనేది. ఆమె వద్ద ఏనుగు దంతంతో చేసిన చదరంగం బల్లకూడా ఉండేది. సావిత్రి మంచి చమత్కారి, అంతే కాదు ఇతరులను అనుకరించటంలో కూడా దిట్ట. ఆమె తన భర్త జెమినీ గణేశన్ను, రేలంగిని, బి.సరోజాదేవిని, ఎస్వీ రంగారావుని, ఇంకా అనేకమందిని తరుచూ అనుకరించేది. దానధర్మాల విషయంలో అమెది ఎముకలేని చెయ్యి. ఒకసారి నిండుగా నగలతో అలంకరించుకుని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి, అక్కడ మొత్తం నగలన్నిటినీ వలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానమిచ్చేసింది.