హ్యాపీ బర్త్ డే షాలిని పాండే

హ్యాపీ బర్త్ డే షాలిని పాండే

'అర్జున్ రెడ్డి' సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే... బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.  నేడు క్యూట్ భామ పుట్టిన రోజు . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత 'మహానటి' సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. అక్కడ వరస సినిమాలు చేస్తుంది. అక్కడ 100 పర్సెంట్ లవ్ రీమేక్‌లో కూడా నటించింది.. ఈ ముద్దుగుమ్మ. ఇక జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. ఇక బాలీవుడ్ లో నటించాలన్న తన కోరిక నెరవేరనుంది అని ఆమధ్య  చెప్పుకొచ్చింది షాలినీ. 'జయేష్ భాయ్ జోర్దార్' అనే సినిమాలో షాలినీ పాండే హీరోయిన్ గా అవకాశం పొందిందట. ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.