హ్యాపీ బర్త్ డే బాలీవుడ్ బాద్షా

హ్యాపీ బర్త్ డే బాలీవుడ్ బాద్షా

ఇండస్ట్రీకి ఏ గాడ్ ఫాదర్ లేకుండానే వచ్చి స్వయంకృషితో బాలీవుడ్‌లో బాద్‌షా‌గా ఎదిగిన వ్యక్తి ఫారుఖ్ ఖాన్! 27 సంవత్సరాలుగా వెండితెరపై కథానాయకుడిగా అలరిస్తున్న బాలీవుడ్ బాద్‌షా నేటితో 50 యేళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫారుఖ్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఒక్కో అవకాశాన్ని ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ నంబర్ వన్ పొజిషన్‌కు చేరిన బాలీవుడ్ బాద్షా.

అమ్మాయిల మనసుదోచుకున్న కింగ్ ఆఫ్ రొమాన్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిన కింగ్ ఖాన్. 1995 అక్టోబర్ 20న వచ్చిన 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రంతో బాలీవుడ్ బాద్ షా గా సిర్థపడ్డాడు షారుఖ్. సర్కస్ సీరియల్ తో బుల్లితెర వీక్షకులను అలరించిన షారుక్ ఖాన్ 1992లో 'దీవానా'గా వెండితెరపై తొలిసారి అలరించాడు. రాజ్ కన్వర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మొదట షారుఖ్ ఖాన్ పాత్ర కోసం అర్మాన్ కొహ్లీని అనుకున్నారు.

కానీ చివరికి షారుఖ్ ను వరించిందా పాత్ర. తొలి చిత్రంలోనే తనకు ఎంతో ఇష్టమైన నజీరుద్దీన్ షా, నానా పటేకర్, రిషీ కపూర్ తో నటించే ఛాన్స్ రావడంతో షారుఖ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత వచ్చిన 'బాజీఘర్', 'డర్' చిత్రాలు షారూక్ లోని నటుడిని అద్భుతంగా ఆవిష్కరించాయి. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకుంది లేదు. షారుఖ్ కెరీర్ లో ఎన్నెన్నో బాక్సాఫీస్ హిట్స్ ఉన్నాయి.

ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములాను పట్టుకోకుండా అప్పుడప్పుడూ 'ఛక్ దే ఇండియా' వంటి చిత్రాల్లోనూ అలరించాడు షారుఖ్. షారుఖ్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది. 15 ఫిలింఫేర్ అవార్డులు అతన్ని వరించాయి. షారుఖ్ సినిమాలకు ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 12 సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేసాయి. ప్రస్తుతం 10 పైగా బ్రాండ్ల యాడ్స్ లో నటిస్తున్నాడు. గతేడాది రిలీజయిన జీరో మూవీ నిరాశ పరచడంతో ఇప్పుడు కోలీవుడ్ సంచలనం అట్లీతో సినిమా చేయబోతున్నాడు బాద్ షా.