గవాస్కర్ 71 వ పుట్టినరోజు శుభాకాంక్షలు... 

గవాస్కర్ 71 వ పుట్టినరోజు శుభాకాంక్షలు... 

భారత క్రికెట్ లెజెండ్ మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ఈ రోజు తన 71 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా భారత ఆటగాళ్లు అందరూ ఆయనకు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 1971 లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ తొలిసారిగా భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 771 పరుగులు చేసి తన ఆటను అందరికి పరిచయం చేసాడు. గవాస్కర్ 125 టెస్టుల్లో 51.12 సగటుతో 10122 పరుగులు చేశాడు. అందులో 34 సెంచరీలు మరియు 45 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గవాస్కర్ 108 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడి 3092 పరుగులు చేశాడు. ఇక టెస్ట్ రికార్డులు చూస్తే.. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన ప్రపంచ క్రికెట్‌లో తొలి బాట్స్మెన్, టెస్ట్ మ్యాచ్‌ల్లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లలో డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బాట్స్మెన్ గవాస్కర్ అలాగే 100 టెస్ట్ క్యాచ్‌లు సాధించిన తొలి ఇండియా ఫీల్డర్ సునీల్ గవాస్కర్ కు 71 వ పుట్టినరోజు శుభాకాంక్షలు.